సిద్దిపేటలో మరో రోడ్డు విస్తరణ... హౌసింగ్ బోర్డ్ కమాన్ టూ కోమటి చెరువు వరకు

సిద్దిపేటలో మరో రోడ్డు విస్తరణ... హౌసింగ్ బోర్డ్ కమాన్ టూ కోమటి చెరువు వరకు
  •     60 ఫీట్ల మేర రోడ్డు విస్తరణ కు నిర్ణయం
  •     రూ.4.95 కోట్లు మంజూరు.. త్వరలో పనులు ప్రారంభం 

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట పట్టణంలో మరో రోడ్డు విస్తరణకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పట్టణ శివార్లలోని హైదరాబాద్ రోడ్డులోని హౌజింగ్ బోర్డు నుంచి కోమటిచెరువు వెళ్లే రోడ్డు విస్తరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర 60 ఫీట్లతో రోడ్డును విస్తరించనున్నారు. డివైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు సెంట్రల్ లైటింగ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.4.95 కోట్లు కేటాయించగా.. టెండర్ ప్రక్రియ పూర్తవడంతో త్వరలో పనులు ప్రారంభానికి అధికారులు సిద్ధం చేశారు. 

తొలగిన అడ్డంకులు 

హౌజింగ్ బోర్డు కమాన్ నుంచి కోమటిచెరువు వరకు దాదాపు 2 కిలో మీటర్ల మేర రోడ్డు విస్తరణపై కొంత కాలంగా స్థానికులు ఆందోళనలు చేశారు. మొదట 100 మీటర్ల మేర రోడ్డు విస్తరణకు అధికారులు ప్రతిపాదించగా స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. హౌజింగ్ బోర్డు కమాన్  నుంచి  దాదాపు అర కిలో మీటర్ మేర రోడ్డు ఇరువైపులా నివాస భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రోడ్డు 60 ఫీట్ల మేర ఉండగా అధికారులు ప్రతిపాదించనట్టుగా వంద ఫీట్లకు విస్తరిస్తే చాలా భవనాలను కూల్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ విషయంపై చర్చలు జరిపిన తరువాత  నివాస భవనాలకు ఇబ్బంది కలకుగండా 60 ఫీట్ల మేర రోడ్డు విస్తరణకు అధికారులు అంగీకారం తెలిపారు. ఈక్రమంలో నాలుగు ఫీట్ల మేర డివైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించనున్నారు. ఇందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక ప్రతిపాదనలను సిద్ధం చేశారు.