యాక్షన్ ప్యాక్డ్ "సిగ్మా" మూవీ టీజర్‌‌‌‌ రిలీజ్

యాక్షన్ ప్యాక్డ్  "సిగ్మా" మూవీ టీజర్‌‌‌‌ రిలీజ్

సందీప్ కిషన్ హీరోగా కోలీవుడ్  స్టార్ విజయ్ కొడుకు సంజయ్ జాసన్  రూపొందిస్తున్న చిత్రం ‘సిగ్మా’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.  యాక్షన్ అడ్వెంచర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఇటీవల షూటింగ్ పూర్తయింది. తాజాగా ఈ మూవీ టీజర్‌‌‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘మంచోడు మహానుభావుడు.. చెడ్డోడు రాక్షసుడు.. చూసే నీ చూపును బట్టి,  ఇప్పుడు ఈ క్షణం నన్ను నేను కాపాడుకోవడానికి ఎలాగైనా మారతాను..’ అని సందీప్ కిషన్  డైలాగ్‌‌తో సాగిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.

  యాక్షన్, ఇంటెన్సిటీ, ఎనర్జిటిక్‌‌గా  సందీప్  స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. కంప్లీట్ యాక్షన్ డ్రామాగా కట్ చేసిన టీజర్ క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఒక ట్రెజర్ హంట్ చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది.  తమన్ అందించిన బ్యాక్‌‌గ్రౌండ్ స్కోరు హైలైట్‌‌గా నిలిచింది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌‌గా కనిపించగా,  రాజు సుందరం, అన్బు థాసన్,  సంపత్ రాజ్  ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో  కేథరీన్ స్పెషల్ సాంగ్‌‌లో అలరించనుంది. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతోన్న  ఈ చిత్రాన్ని  సమ్మర్‌‌‌‌లో రిలీజ్ చేయనున్నారు.