భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కార్మికులకు సంబంధించిన టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపులు సకాలంలో జరిగేలా పర్సనల్ అధికారులు చొరవ చూపాలని సింగరేణి కాలరీస్ కంపెనీ జీఎం వెల్ఫేర్ జీవీ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్ నుంచి సింగరేణిలోని అన్ని ఏరియాల్లోని పర్సనల్ ఆఫీసర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం విషయంలో రాజీ పడవద్దన్నారు. టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపులలో జాప్యం ఉండకూడదన్నారు. కారుణ్య నియామకాలపై చర్చించారు. ఈ ప్రోగ్రాంలో డీజీఎంలు కేసా నారాయణరావు, ముకుంద సత్యనారాయణ, సీనియర్ పీవో ఎం.శ్రీనివాస్, అధికారులు సుజ్ఞాన్, కె.వర ప్రసాద రావు పాల్గొన్నారు.
