తండ్రైన టాలీవుడ్ సింగర్ రేవంత్

తండ్రైన టాలీవుడ్ సింగర్ రేవంత్

తెలుగు స్టార్ సింగర్ లలో ఒకరు, బిగ్ బాస్ - 6 కంటెస్టంట్ రేవంత్ తండ్రయ్యారు. అతని భార్య అన్విత ఈ రోజు ఉదయం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రేవంత్ స్నేహితులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రేవంత్ బిగ్ బాస్ షోకు వెళ్లే కంటే ముందే తన భార్య అన్విత గర్భిణీగా ఉంది. షో పలుమార్లు తన భార్య గురించి, పుట్టబోయే బిడ్డ గురించి చాలా సార్లు మాట్లాడాడు. అయితే ఈ విషయాన్ని బిగ్ బాస్, రేవంత్ కి ఈ వీకెండ్ లో చెప్తారని అందరూ ఆశిస్తున్నారు. 

ఆల్రెడీ సెలబ్రెటీగా మంచి పేరు తెచ్చుకున్న సింగర్ రేవంత్ కి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత మరింత పాపులారిటీ వచ్చింది. అన్ని టాస్కుల్లోనూ గట్టి పోటీ ఇస్తూ ముందంజలో నిలుస్తోన్న రేవంతే.. ఈ సారి టైటిల్ కొడతాడని సోషల్ మీడియాలో ప్రచారం కూడా సాగుతోంది. దీంతో రేవంత్ విన్నర్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ షో అయిపోయేందుకు ఇంకా రెండు వారాల సమయమే ఉండడంతో ఈ సారి టైటిల్ కొట్టేది ఎవరా అని ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు.