సింగూరు, మంజీరా గేట్లు ఓపెన్...

సింగూరు, మంజీరా గేట్లు ఓపెన్...

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్​ కు తాగునీటిని అందించే ప్రధాన జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూరు, మంజీరా, నాగార్జున సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్​కు చేరుకుంటున్నాయి. ఫలితంగా ఇప్పటికే హిమాయత్ సాగర్​గేట్లు ఎత్తగా, శనివారం సింగూరులో 5 గేట్లు, మంజీరాలో 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

ఉస్మాన్ సాగర్ నీటి మట్టం 1786.65 అడుగులకు చేరగా, మరో రెండు- మూడు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సింగూరులో 21.47 టీఎంసీలు, మంజీరాలో 1650.2 అడుగుల నీటి నిల్వ ఉంది. ఈ జలాశయాలు ఈసారి ఆగస్టులోనే ఫుల్ కావడంతో రాబోయే రెండేండ్లపాటు హైదరాబాద్ ​కు నీటి సమస్య ఉండదని అంచనా వేస్తున్నారు.