"సార్‌‌‌‌‌‌‌‌" మూవీ రిలీజ్

"సార్‌‌‌‌‌‌‌‌"  మూవీ రిలీజ్

ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన  చిత్రం ‘సార్‌‌‌‌‌‌‌‌’.  సితార ఎంటర్‌‌‌‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ మూవీ శుక్రవారం రిలీజ్ అవుతోంది.  ఈ సందర్భంగా హైదరాబాద్‌‌‌‌లో  నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌కి దర్శకుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘గురువుల గొప్పతనం గురించి సినిమా తీసిన వెంకీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక మనిషి జీవనశైలిని మార్చగలిగేది చదువు మాత్రమే. ఒక పేదవాడి కొడుకుని డబ్బున్న వాడిని చేయగలిగేది చదువు. ఒక గుమాస్తా కొడుకుని కలెక్టర్ ని చేయగలిగేది చదువు. ఒక మామూలు మనిషి కొడుకుని ఒక సుందర్ పిచై, ఒక సత్య నాదెళ్ళ లాంటి స్థాయికి.. ప్రపంచం మొత్తం చూసే స్థాయికి తీసుకెళ్లగలిగేది చదువు. అంత గొప్ప ఆయుధాన్ని కేవలం డబ్బు మీకు లేదని ఒక కారణం మూలంగా వాళ్ళకి దూరం చేయడం ఎంతవరకు కరెక్ట్?. ఈ ప్రశ్నే ఈ సినిమాలో వెంకీ అడిగే ప్రయత్నం చేశాడు. అందుకే ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది’ అన్నారు. ధనుష్ మాట్లాడుతూ ‘ఇదొక అద్భుతమైన ఎమోషన్స్, మెసేజ్‌‌‌‌తో కూడిన సింపుల్ సినిమా. అందరూ కనెక్ట్ అయ్యేలా  ఉంటుంది’ అని చెప్పాడు. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌‌‌‌గా ఉన్నామన్నారు నాగవంశీ, వెంకీ, సంయుక్తా. టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.