బషీర్‌బాగ్, వెలుగు: మంగ్లీకి సంబంధించిన మైక్రో ఫైనాన్స్ కేసులో ప్రభుత్వం సిట్ వేయాలని లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బాధితుల తరఫు న్యాయవాది సుబ్బారావు డిమాండ్ చేశారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బాధితులకు అండగా నిలుస్తామని గతంలో ప్రకటించిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కేసులో ప్రధాన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తానని పేర్కొన్నారు.
