'కళావతి’ పాటకు సితార స్టెప్పులు

'కళావతి’ పాటకు  సితార స్టెప్పులు

సర్కారువారి పాట సినిమాలోని కళావతి పాటకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఇటీవల రిలీజైన ఈ సాంగ్ కు రీమేక్ వీడియోస్ చేస్తూ ప్రిన్స్ అభిమానులు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పాటకు సూపర్ స్టార్ మహేష్‌ బాబు కూతురు సితార కూడా స్టెప్స్ వేసి అదరగొట్టింది. ఈ వీడియోను మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.

మహేష్ గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్‌ వీడియోస్‌ తో తనకంటూ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న ఈ చిన్నారి.. సొంతంగా ఇన్‌స్టా అకౌంట్‌ ఓపెన్‌ చేసింది. తన అభిప్రాయాలు ఎప్పుటికప్పుడూ అభిమానులతో పంచుకుంటోంది. ఏదో ఒక వీడియో పోస్టు చేస్తూ.. సోషల్‌ మీడియా క్వీన్‌గా మారిపోయింది సూపర్‌ స్టార్‌ డాటర్‌ సితార. తాజాగా ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి విడుదలైన కళావతి పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది సితార. అచ్చం వాళ్ల నాన్న మహేష్‌ బాబు వేసినట్లే అదిరిపోయే స్టెప్పులేసి అందరి మనసులు దోచుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.