‘ప్రిన్స్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్న శివ కార్తికేయన్

‘ప్రిన్స్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్న శివ కార్తికేయన్

డాన్, డాక్టర్ లాంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శివ కార్తికేయన్.. త్వరలో ‘ప్రిన్స్’ అనే స్ట్రయిట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకుడు. ఉక్రెయిన్ నటి మరియా రయబోషాప్కా హీరోయిన్‌‌. సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, రామ్మోహన్ రావు కలిసి నిర్మిస్తున్నారు. మూవీ ట్రైలర్‌‌‌‌ను నిన్న విడుదల చేశారు. ‘స్కూల్‌‌ టీచర్‌‌‌‌గా కనిపిస్తోన్న శివ కార్తికేయన్, అదే స్కూల్‌‌లో టీచర్‌‌‌‌గా చేరిన ఫారినర్‌‌‌‌ మరియాతో లవ్‌‌లో పడ్డాడు. కానీ ఓ ఇండియన్ అబ్బాయి, బ్రిటీష్‌‌ అమ్మాయిని ప్రేమించడం ఏమిటంటూ దీన్నో దేశ సమస్యగా చూస్తున్నారు ఊరి జనం.

దేశభక్తి అంటే ఏమిటో తెలుసా, ఇండియాకు సంబంధించిన ఒక్క విషయమైనా ఫాలో అయ్యావా అంటూ అతన్ని నిలదీస్తున్నారు. ‘ఇండియన్స్ అంతా నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఫాలో అయ్యాను కనుకే ఒక బ్రిటీష్‌‌ అమ్మాయిని లవ్ చేశాను’ అంటున్నాడు హీరో. ఈ లవ్‌‌ స్టోరీకి ఎండ్‌‌ కార్డ్‌‌ ఎలా పడిందనేదే మిగతా కథ. వీరి ప్రేమను సపోర్ట్ చేసే కీలక పాత్రలో సత్యరాజ్ కనిపించారు. మేయర్‌‌, మున్సిపల్ మేయర్.. టైలర్, ఎలిజిబెత్ టేలర్ అంటూ ఫన్నీ డైలాగ్స్‌‌తో తన మార్క్‌‌ కామెడీని ఇందులో చూపించాడు అనుదీప్. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ట్రైలర్‌‌‌‌తో ఇంప్రెస్‌‌ చేసిన ఈ మూవీ దీపావళి సందర్భంగా ఈనెల 21న విడుదల కాబోతోంది.