భద్రాచలం, వెలుగు : మావోయిస్ట్ పార్టీకి చెందిన ఆరుగురు గురువారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ ఎస్పీ నిఖిల్ రాఖేచ సమక్షంలో లొంగిపోయారు. సరెండర్ అయిన వారిలో ఏసీఎంలు మంగేశ్ పొడియామి, గణేశ్ వీకే, మంగతి జురీ, హిడ్మే మర్కాం అలియాస్ సునీత, రాజే, పీపీసీఎం స్వరూపా ఉసెండీ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులు ఒక ఎస్‌ఎల్‌ఆర్, రెండు 303 రైఫిల్స్‌ను పోలీసులకు అప్పగించారు.
