పెళ్లై ఆరునెలలు కూడా కాలేదు.. భార్యభర్తల మధ్య మనస్పర్థలు..తరుచుగా గొడవలు.. చివరికి భార్య ప్రాణాలమీదకు తెచ్చింది.కూకట్ పల్లిలో చందన జ్యోతి అనే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది..ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన చందన జ్యోతి, కొత్త గూడెంకు చెందిన యశ్వంత్ కు ఆగస్టులో పెళ్లైంది. మూసాపేట్ అంజయ్య నగర్ లో నివాసం ఉంటున్నారు. యశ్వంత్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తు్న్నాడు. గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంలో చందన జ్యోతి మనస్తాపానికి గురైంది.
శుక్రవారం (డిసెంబర్ 12) రాత్రి ఇంట్లో బెడ్ రూంలో చందన జ్యోతి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త యశ్వంత్ పోలీసులకు ఫోన్ చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్ట్ మార్టమ్ కోసం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

