హైదరాబాద్ ట్రావెల్ ట్రెండ్‌ మారింది.. కల్చరల్ టూరిజంకు పెరుగుతున్న ఆదరణ

హైదరాబాద్ ట్రావెల్ ట్రెండ్‌ మారింది.. కల్చరల్ టూరిజంకు పెరుగుతున్న ఆదరణ
  • కల్చరల్​ టూర్లపై హైదరాబాదీల ఆసక్తి..భారీగా పెరుగుతున్న ప్రయాణాలు
  • స్కై స్కానర్​ తాజా రిపోర్ట్​ వెల్లడి

హైదరాబాద్​, వెలుగు:హైదరాబాదీల ప్రయాణ శైలిలో మార్పులు వచ్చాయని  ట్రావెల్ అగ్రిగేటర్ స్కైస్కానర్ వెల్లడించింది. హైదరాబాద్​లో మంగళవారం ఇది విడుదల చేసిన రిపోర్ట్​ ప్రకారం..ప్రతి ఇద్దరిలో ఒకరు సాంస్కృతిక అనుభవాల కోసం ప్రయాణిస్తున్నాడు. ఇతర ప్రాంతాల ప్రసిద్ధ ఆహార రుచులు 56 శాతం మందిని ఆకర్షిస్తుండగా, పండుగలు 54 శాతం, ఆధ్యాత్మిక యాత్రలు 51 శాతం మందిని ఆకట్టుకుంటున్నాయి.

కేవలం సాధారణ సందర్శనలే కాకుండా స్థానిక సంప్రదాయాలను ఆస్వాదించేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణతో పాటు కేరళను 18 శాతం, ఆంధ్రప్రదేశ్​ను 17 శాతం మంది ఎంచుకున్నారు. దుర్గాపూజ, దీపావళి, కుంభమేళా వంటి వాటికి భారీగా వెళ్తున్నారు.