మెట్రో రైలా.. ఫైటింగ్ రింగా అది..

మెట్రో రైలా.. ఫైటింగ్ రింగా అది..

ఢిల్లీ మెట్రోకి సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‎గా నిలుస్తుంటాయి. నిబంధనలకు విరుద్ధంగా మెట్రో స్టేషన్‎లో డ్యాన్స్ చేయడం , రీల్స్ చేయడం, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా వీడియోలు తీయడం వంటివి ఇక్కడ పరిపాటిగా జరుగుతుంటాయి. ఎంత కట్టడి చేసినా కంటెట్ క్రియేటర్లు తమ పని చేసుకుంటూ పోతుంటారు. లేటెస్టుగా మెట్రోకి సంబంధించిన మరో వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఢిల్లీ మెట్రోలో  ఇద్దరు మహిళలు వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో కొందరు మహిళలు, యువతులు మెట్రో కోచ్‌లో గొడవ పడుతుండటం గమనించవచ్చు. ఒకరికొకరు బట్టలు, జుట్టు లాగుతూ కొట్టుకోవటం కనిపించింది. మరికొందరు ప్రయాణికులు ఇద్దరినీ విడదీసి గొడవ ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఒకరినొకరు వదులుకోవడం లేదు.. కుస్తీ పోటీలు పడినట్టుగా కొట్టుకున్నారు.

ఈ వీడియోలో నల్లటి సల్వార్ సూట్ ధరించిన మహిళ, పసుపు రంగు సల్వార్ సూట్ ధరించిన మహిళలు వాగ్వాదానికి దిగారు.  వీరిని విడదీయడానికి  ఒక మహిళా పోలీస్ అధికారి, కొంతమంది ప్రయాణికులు  ప్రయత్నించారు.  ఆ సమయంలో నల్లటి సల్వార్ సూట్ ధరించిన మహిళ తాను న్యాయమూర్తి కుమార్తెను..నిన్ను విడచిపెట్టనంటూ హెచ్చరించినట్టు వీడయోలో స్పష్టంగా తెలుస్తుంది.  అయినా వారి మధ్య గొడవ ఆగలేదు.  ఆ సమయంలో మరో వ్యక్తి తాను ఎలాంటి తప్పు చేయలేదని అనడంతో నల్ల దుస్తులు ధరించిన మహిళ వెనక్కుతగ్గింది. 
 
ఈ వీడియో షుర్ కా కాలేష్ అనే ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  ఈ వీడియో ట్రోల్ కావడంతో నెటిజన్లు స్పందించారు.  నల్ల రంగు దుస్తులు ధరించిన మహిళ తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు.  ఢిల్లీ ప్రజలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు.... ఇవన్నీ  దేశ రాజధాని మెట్రోలో సాధారణమే అని మరొరు కామెంట్ చేశారు.  ఇంకొకరు జడ్జి కుమార్తె అయితే ఏంటి.. ఏదైనా సమస్యలు ఉంటే శాంతియుతంగా చర్చించుకోవాలికాని జుట్టు పట్టుకొని కొట్టుకోకూడదని రాసుకొచ్చారు.  మహిళా పోలీస్ అధికారికి సెల్యూ్ట్ చేద్దాంమని ఒక వ్యక్తి పోస్ట్ చేశాడు.