నటి శ్రీదేవి కుటుంబానికి భారీ ఊరట. నటి శ్రీదేవి కుటుంబ ఆస్తి వివాదంలో మద్రాసు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్ లోని సుమారు 4.7 ఎకరాల భూమిపై బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్లను కాదని, కొందరు వ్యక్తులు అక్రమంగా హక్కులు కోరుతూ వేసిన దావాను హైకోర్టు కొట్టివేసింది. నటి శ్రీదేవి ఆస్తిపై యాజమాన్యం కోరుతూ చెంగల్పట్టు కోర్టులో దాఖలైన కేసును మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
1988లో శ్రీదేవి చట్టబద్ధంగా కొనుగోలు చేసిన 4.7 ఎకరాల భూమిపై కొంతమంది వ్యక్తులు నకిలీ వారసత్వ సర్టిఫికేట్‌లతో హక్కులు క్లెయిమ్ చేశారు. గత 37 సంవత్సరాలుగా ఆ ఆస్తిని అనుభవిస్తున్న ముదలియార్ కుమారుడు చంద్రశేఖరన్ ముదలియార్, అతని రెండో భార్య కుమారుడు నటరాజన్ ,కుమార్తె శివగామి అనే ముగ్గురు వ్యక్తులు నకిలీ వారసత్వ సర్టిఫికెట్లు పొంది ఆ ఆస్తిలో తమకు వాటా ఉందని చెంగల్పట్టు అదనపు సెషన్స్ కోర్టులో టైటిల్ కేసు దాఖలు చేశారు.ఈ దావాను ప్రయోజనం లేని, అక్రమ ఆస్తి కోసం వేసిన వివాదాస్పద దావాగా జస్టిస్ టి.వి. తమిళ్‌సెల్వి ధర్మాసనం ఈ కేసును తోసిపుచ్చింది.
