మారుతి కార్లపై డిస్కౌంట్ల జాతర: ఏ కారు కొన్న భారీగా ఆఫర్స్.. కొన్నొళ్లకు పండగే..

మారుతి కార్లపై డిస్కౌంట్ల జాతర: ఏ కారు కొన్న భారీగా ఆఫర్స్.. కొన్నొళ్లకు పండగే..

కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఈ నెలలో (మే 2026)  'ఎరీనా' మోడల్ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. అయితే కారు మోడల్‌ బట్టి క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు,  స్క్రాపేజ్ బోనస్‌లు, ఆఫీస్ ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు అందిస్తుంది. మారుతీ విక్టోరిస్‌పై అత్యధికంగా సేవింగ్స్ ఇస్తుండగా.. బ్రెజ్జా, వాగన్ ఆర్, ఆల్టో కె10, స్విఫ్ట్, సెలెరియో వంటి మోడళ్లపై కూడా చెప్పుకోదగ్గ ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. 

ఏ కారుపై మీరు ఎంత డిస్కౌంట్ పొందొచ్చంటే: 

మారుతి విక్టోరిస్  
విక్టోరిస్ CNG వేరియంట్లపై రూ. 70,000 వరకు బెనిఫిట్స్ ఉండగా, పెట్రోల్ ఇంకా హైబ్రిడ్ వేరియంట్లపై రూ. 50,000 వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. వీటిలో CNG ట్రిమ్‌లపై రూ. 60,000 వరకు, పెట్రోల్, హైబ్రిడ్ వేరియంట్లపై రూ. 40,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లతో పాటు, రూ. 10,000 డిస్కౌంట్ కూడా ఉన్నాయి. విక్టోరిస్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా సియెర్రా, హోండా ఎలివేట్‌లకు పోటీగా నిలుస్తుంది. దీని ధర రూ . 10.50 లక్షల నుండి రూ. 19.99 లక్షల మధ్య ఉంటుంది.

మారుతి బ్రెజ్జా 
 బ్రెజ్జా పెట్రోల్ & CNG వేరియంట్లపై రూ. 55,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో రూ. 25,000 కన్స్యూమర్ ఆఫర్, రూ. 25,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లు ఇంకా రూ. 5,000 సంస్థాగత డిస్కౌంట్స్ ఉన్నాయి. రూ. 8.26 లక్షల నుండి రూ. 12.86 లక్షల ధర ఉన్న బ్రెజ్జా.. టాటా నెక్సాన్ , కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూలకు పోటీగా నిలుస్తుంది .

 మారుతి వాగన్ ఆర్ 
 ఈ టాల్-బాయ్ హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ & CNG వేరియంట్లు రెండింటిలోనూ మొత్తం రూ. 52,500 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిలో రూ. 25,000 కన్స్యూమర్ ఆఫర్, రూ. 25,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లు, రూ. 2,500 కంపెనీ డిస్కౌంట్ ఉన్నాయి. వాగన్ ఆర్ ధర రూ. 4.99 లక్షల నుండి రూ. 6.84 లక్షల మధ్య ఉంటుంది. ఈకారు టాటా టియాగో, సిట్రోయెన్ C3 లకు పోటీగా నిలుస్తుంది . 

మారుతి ఆల్టో K10 
 ఆల్టో K10  LXi పెట్రోల్ వేరియంట్‌పై బెనిఫిట్స్ రూ. 52,500 వరకు ఉండగా, ఇతర ట్రిమ్‌లపై రూ. 42,500 వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. వీటిలో రూ. 25,000 వరకు కన్స్యూమర్ ఆఫర్, రూ. 25,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లు, రూ. 2,500 కంపెనీ తగ్గింపు ఉన్నాయి. రెనాల్ట్ క్విడ్‌కు పోటీగా ఉన్న దీని ధర రూ. 3.70 లక్షల నుండి రూ. 5.45 లక్షల మధ్య ఉంది.

మారుతి స్విఫ్ట్ 
 మారుతి స్విఫ్ట్ కారు  AMT వేరియంట్లపై రూ. 45,000 వరకు, మాన్యువల్ & CNG ట్రిమ్‌లపై రూ. 40,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్లలో AMT వేరియంట్లపై రూ. 15,000, ఇతర వేరియంట్లపై రూ. 10,000 కన్స్యూమర్ డిస్కౌంట్, రూ. 25,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లు, రూ. 5,000 కంపెనీ  డిస్కౌంట్స్ ఉన్నాయి. రూ. 5.79 లక్షల నుండి రూ. 8.65 లక్షల మధ్య ధర ఉన్న స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, టాటా టియాగోలకు పోటీగా నిలుస్తుంది.

 మారుతి సెలెరియో 
సెలెరియో అన్ని వేరియంట్లపై రూ. 37,500 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో రూ. 10,000 కన్స్యూమర్ ఆఫర్, రూ. 25,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లు, రూ. 2,500 కంపెనీ డిస్కౌంట్ ఉన్నాయి. టాటా టియాగో, రెనాల్ట్ క్విడ్‌లకు పోటీగా నిలుస్తున్న సెలెరియో ప్రారంభ ధర రూ . 4.70 లక్షలు కాగా, టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 6.73 లక్షలుగా ఉంది.

మారుతి S-ప్రెస్సో  
 ఎస్ -ప్రెస్సో అన్ని వేరియంట్లపై రూ. 37,500 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆఫర్లలో  రూ. 10,000 కన్స్యూమర్ తగ్గింపు, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌ రూ. 25,000 వరకు, కంపెనీ తగ్గింపు రూ. 2,500 ఉన్నాయి. ప్రస్తుతం మారుతి అందిస్తున్న అత్యంత సరసమైన మోడల్ అయిన ఎస్-ప్రెస్సో ధర రూ. 3.50 లక్షల నుండి రూ. 5.25 లక్షల మధ్య ఉంది. మారుతి S-ప్రెస్సో రెనాల్ట్ క్విడ్, ఆల్టో కె10కి పోటీగా నిలుస్తుంది.

 మారుతి ఈకోపై 
ఈకో పెట్రోల్ ఇంకా CNG వేరియంట్లు రెండూ రూ. 37,500 వరకు ప్రయోజనాలతో వస్తుంది. వీటిలో రూ. 10,000 కన్స్యూమర్ ఆఫర్, రూ. 25,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లు, రూ. 2,500 కంపెనీ డిస్కౌంట్స్  ఉన్నాయి. ఈకో ధర రూ. 5.21 లక్షల నుండి రూ. 6.36 లక్షల మధ్య ఉంది.

గమనిక: ఈ ధరలు అన్ని  భారతదేశంలోని ఎక్స్-షోరూమ్ ధరలు. ఆఫర్స్ నగరాన్ని బట్టి మారవచ్చు అలాగే స్టాక్ ఉన్నంతవరకు మాత్రమే  ఉంటాయి. ఖచ్చితమైన వివరాల కోసం మీ దగ్గరలోని డీలర్‌ను సంప్రదించండి.