ఐపీఎల్ 2026 సీజన్ లో పాయింట్స్ టేబుల్ లో బాటమ్ సైడ్ ఉంటూ వస్తున్న చెన్నై సూపర్ కింగ్స్.. 48వ మ్యాచ్ లో ఢిల్లీని ఓడించి అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ప్లేఆఫ్స్ లో మా ఆశలు సజీవంగానే ఉన్నాయని సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత సీజన్‌లో మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో మూడింటిని గెలుచుకున్న చెన్నై , ఇంకా మిగిలి ఉన్న 4 మ్యాచ్‌లలో మరో 8 పాయింట్లు సాధించి, నెక్స్ట్ రౌండ్‌కు సునాయాసంగా అర్హత సాధించాలని ఆశిస్తోంది.
చెన్నై ప్లే ఆఫ్స్ రేసుకు దూసుకొచ్చిన తరుణంలో.. టాప్ 4లో స్థానం సాధిస్తుందా అనేది చర్చించాల్సిన విషయం. ఎందుకంటే టాప్ 4 స్థానాల కోసం పోటీ అయితే చాలా తీవ్రంగానే ఉంది. ఇప్పటి వరకు 10 జట్లలో ఏ టీమ్ కూడా క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇంకా ఐపీఎల్ నుంచి అధికారికంగా ఎగ్జిట్ కాలేదు.
పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 13, 12 పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. అదే సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు చెరో 12 పాయింట్లు ఉన్నప్పటికీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ కంటే పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక మ్యాచ్ తక్కువ ఆడాయి. ఈ పరిస్థితుల్లో ఆ రెండు జట్లకు ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫమ్ చేసుకోడానికి మెరుగైన అవకాశం ఉంది. అయితే ప్రస్తుత సినారియోలో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే ఏ టీమ్ కు ఎలాంటి అవకాశాలున్నాయో చూద్దాం.
ప్లేఆఫ్స్ రేస్..
పంజాబ్ (PBKS) : 13 పాయింట్లతో టాప్ లో ఉన్న పంజాబ్.. ప్లేఆఫ్ బెర్త్ కన్ఫమ్ చేసుకునేందుకు ఇంకా 5 గేమ్స్ ఉన్నాయి. ఇందులో రెండు గెలిచినా17 పాయింట్లతో ప్లేఆఫ్స్ కు వెళ్తుంది. దీనికి తోడు నెట్ రన్ రేట్ ఉండటంతో NRR (+0.855) ఒక మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్ కు చేరుకునే ఛాన్స్ ఉంది.
బెంగళూర్ (RCB) : బెంగళూర్ కు ప్రస్తుతం 12 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే16 లేక 18 పాయింట్లు సాధించాలంటే 2 లేదా 3 మ్యాచ్ లలో గెలవాల్సి ఉంటుంది. నెట్ రన్ రేట్ NRR (+1.420) కూడా ఈ టీమ్ కు ప్లస్ పాయింట్. వేరే టీమ్స్ ఫలితాలు బెంగళూర్ కు అనుకూలంగా వస్తే, 14 పాయింట్లతో కూడా అర్హత సాధించే అవకాశం ఉంది.
హైదరాబాద్ (SRH) : హైదరాబాద్ 12 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. 16 పాయింట్ల మార్కును చేరుకోవాలంటే మిగిలి ఉన్న 4 మ్యాచ్‌లలో 2 గెలవాలి. బలమైన బ్యాటింగ్ లైనప్ కారణంగా రన్ రేట్ ను NRR (+0.644)ను పటిష్టంగా ఉందనే చెప్పాలి.
రాజస్థాన్ (RR): SRH లాగే, 16 పాయింట్లు సాధించి ప్లేఆఫ్ చేరుకోవడానికి రాజస్థాన్ కు కూడా మరో 2 విజయాలు అవసరం. అయితే, ఫామ్ లేమితో బాధ పడుతున్న రాజస్థాన్.. పోటీలో ముందుండాలంటే రన్ రేట్ NRR (+0.510)ను కాపాడుకోవాల్సి ఉంటుంది.
గుజరాత్(GT) : టాప్ 4 జట్లతో పాయింట్ల పరంగా సమానంగా ఉన్నప్పటికీ, రన్ రేట్ NRR (-0.147) తక్కువగా ఉండటం ఈ టీమ్ కు కాస్త నెగెటివ్ న్యూస్. NRRను మెరుగుపరుచుకుని, RR లేదా SRHను అధిగమించాలంటే, చివరి 4 మ్యాచ్ లలో కనీసం 2 మ్యాచ్ లను భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) : చెన్నై చేతిలో 10 పాయింట్లు ఉన్నాయి. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే 16 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. ఇంకా 4 మ్యాచ్ లు ఉన్నాయి కాబట్టి.. అందులో కనీసం 3 గెలవాలి. రన్ రేట్ NRR (+0.151) పాజిటివ్ గా ఉండటం కలిసొచ్చే అంశం. ఇతర టీమ్స్ 14 లేదా 16 పాయింట్లతోనే ఆగిపోతే రన్ రేట్ చెన్నైకి కీలకం కావచ్చు.
►ALSO READ | స్మృతి మంధనా మాజీ బాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
ఢిల్లీ (DC) : ఢిల్లీకి మిగతా జట్లలా ఆప్షన్ లేదు. 10 పాయింట్లే ఉన్నందున.. ఉన్న మూడు మ్యాచ్ లు తప్పక గెలవాలి. 16 పాయింట్లు సాధించాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌లలోనూ తప్పక గెలవాలి. ఒక్క మ్యాచ్ ఓడినా.. ఇతర టీమ్స్ ఓటమిపై ఆధారపడవలసిన పరిస్థితి. అంతేకాకుండా భారీ స్కోర్ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత నెట్ రన్ రేట్ (-0.949) ఒక పెద్ద అడ్డంకిగా మారవచ్చు.
కోల్ కతా (KKR) : కోల్ కతా కేవలం 7 పాయింట్లతో చివరి నుంచి 3వ ప్లేస్ లో ఉంది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఇంకా పది పాయింట్లు సాధించాలి. మిగిలిన 5 మ్యాచ్‌లలోనూ తప్పక గెలిస్తే 17 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. అయితే రన్ రేట్ NRR (-0.539) తక్కువగా ఉండటంతో.. 4 గెలిచినా (15 పాయింట్లు) సరిపోకపోవచ్చు.
ముంబై (MI) : ముంబై చేతిలో 6 పాయింట్లే ఉన్నాయి. కనీసం 14 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. అన్ని మ్యాచ్‌లు గెలవాలి. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న జట్లు తమ మిగిలిన మ్యాచ్‌లలో దాదాపు అన్నింటిలోనూ ఓడిపోవాలి. అది జరిగే పనికాదు.
లక్నో ( LSG) : కేవలం రెండు మ్యాచ్ లు గెలిచి 4 పాయింట్లతో అన్నింటికంటే కింది స్థానంలో ఉన్న లక్నో.. దాదాపుగా ఎగ్జిట్ అయినట్లే. ఒకవేళ మిగిలిన 5 మ్యాచ్ లు గెలిచినా (14 పాయింట్లు సాధించినా), రన్ రేట్ NRR (-1.076) మైనస్. ఈ పరిస్థితుల్లో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించడం అసాధ్యమనే చెప్పాలి.
