
సంజయ్ రావ్(Sanjay rao), ప్రణవి మానుకొండ(Pranavi manukonda) జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్లమ్ డాగ్ హస్బెండ్(Slumdog husbend)’. ఏఆర్ శ్రీధర్(AR Sridhar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyanram) ఈ ట్రైలర్ ను రిలీజ్ చేసి.. మూవీ టీమ్ కు బెస్ట్ విషెష్ తెలిపారు.
ఇక ఈ ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. తాను ప్రేమించిన ఆమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి హీరో పడే కష్టాలే ఈ సినిమా కథ అని అర్థమవుతోంది. అయితే ఈ సింపుల్ కథకు.. కుక్క కోర్టులో కేసు వేయడం అనే కొత్త కాన్సెప్ట్ ను యాడ్ చేశారు మేకర్స్. దీంతో ట్రైలర్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. అంతేకాదు.. ఈ ట్రైలర్ తో సినిమాపై మంచి బజ్ కూడా క్రియేట్ అయ్యింది. ఇక హీరోపై కేసు పెట్టిన కుక్క గెలిచిందా? ఆ తరువాత ఎం జరిగింది అనేది తెలియాలంటే సినిమా చూడాలి అంటున్నారు మేకర్స్. ఇక బ్రహ్మాజీ, సప్తగిరి, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.