కేబినెట్ కమిటీలో మార్పులు.. స్మృతి, కిషన్ రెడ్డికి చోటు

కేబినెట్ కమిటీలో మార్పులు.. స్మృతి, కిషన్ రెడ్డికి చోటు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గ విస్తరణ తర్వాత ప్రధాని మోడీ కేబినెట్ కమిటీలను పునర్వ్యవస్థీకరణపై ద‌ృష్టి సారించారు. కేబినెట్ కమిటీలో యువ మంత్రులకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోడీ నేతృ‌త్వంలోని రాజకీయ వ్యవహారాల కమిటీలో కేంద్ర మంత్రులు స్మృతి ఇరాని, భూపేందర్ యాదవ్, సర్బానంద సోనోవాల్‌‌కు చోటు కల్పించారు. మోడీ నేతృత్వంలోని ఉద్యోగాల కల్పన, స్కిల్ డెవలప్‌‌మెంట్ కేబినెట్ కమిటీలో అశ్విన్ వైష్ణవ్, భూపేందర్ యాదవ్, రామచంద్ర ప్రసాద్ సింగ్, కిషన్ రెడ్డిలకు అవకాశం కల్పించారు.

పెట్టుబడులు, అభివృద్ధి కేబినెట్ కమిటీలో మోడీ, అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రులు నారాయణ్ రాణే, జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్‌‌లకు స్థానం దక్కింది. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీలో కేంద్ర మంత్రులు వీరేంద్ర కుమార్, కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్‌‌కు స్థానం కల్పించారు. ఇక కీలకమైన కేబినెట్ సెక్యూరిటీ కమిటీలో ఎలాంటి మార్పులు చేయలేదు.