
దుబాయ్: ఇండియా విమెన్స్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన టీ20 ర్యాంక్ మెరుగైంది. మంగళవారం (జులై 01) విడుదల చేసిన తాజా లిస్ట్‌లో మంధాన (771) ఒకప్లేస్ మెరుగై మూడో ర్యాంక్‌లో నిలిచింది. ఆమె కెరీర్‌లో ఇవే హయ్యెస్ట్ రేటింగ్ పాయింట్లు కావడం విశేషం.
ఇప్పటికే వన్డేల్లో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న మంధాన.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో సెంచరీ చేయడం కలిసొచ్చింది. బెత్ మూనీ (794), హేలీ మాథ్యూస్ (774) టాప్–2లో కొనసాగుతున్నారు. ఓపెనర్ షెఫాలీ వర్మ 13వ ర్యాంక్‌లో ఉండగా, హర్లీన్ డియోల్ 86వ ర్యాంక్ సాధించింది. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ (735) రెండు నుంచి మూడో ర్యాంక్‌కు పడిపోయింది