హయత్ నగర్‎లో సాఫ్ట్‎వేర్ ఉద్యోగుల డ్రగ్స్ దందా

హయత్ నగర్‎లో సాఫ్ట్‎వేర్ ఉద్యోగుల డ్రగ్స్ దందా

హైదరాబాద్ సిటీ, వెలుగు: ముగ్గురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎండీఎంఏ డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డారు. హయత్ నగర్ సమన్ నగర్‎లో అంజద్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన ఉద్యోగం పోవడంతో బెంగళూరు నుంచి మరో సాఫ్ట్ వేర్ హేమంత్ తో కలిసి పెట్టుబడి పెట్టి 10  గ్రాముల ఎండీఎంఏను తెచ్చాడు. హరీశ్ అనే మరో సాఫ్ట్ వేర్ ఉద్యోగి కొనుగోలు చేస్తుండగా.. ఎస్ టీ ఎఫ్‌‌‌‌ బీ టీం సీఐ భిక్షారెడ్డి పట్టుకున్నారు.  

నిందితులు బెంగళూరులో గ్రాము ఎండీఎంఏను రూ.2 వేలకు  కొని నగరంలో రూ. 8వేల నుంచి రూ. 10 వేలకు గ్రాము చొప్పున అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. 7.44 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసుకున్నారు. హయత్ నగర్ ఎక్సైజ్ స్టేషన్లో డ్రగ్స్ తో పాటు ముగ్గురు నిందితులను అప్పగించినట్లు బీ టీం లీడర్ ప్రదీప్ రావు తెలిపారు.