హైదరాబాద్ లో విదేశీ యువతి పట్ల అసభ్య ప్రవర్తన..గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై కేసు

హైదరాబాద్ లో  విదేశీ యువతి పట్ల అసభ్య ప్రవర్తన..గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై కేసు

హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఓ విదేశీ యువతి పట్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది. నెదర్లాండ్స్‌కు చెందిన ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్ కోసం గతేడాది మార్చిలో భారత్‌కు వచ్చింది. కొండాపూర్‌లోని ఓ నివాసంలో తన బాయ్‌ఫ్రెండ్‌తో పాటు, అదే రూమ్‌లో ఉంటున్న ఆదిత్య ఆనంద్ అనే మరో యువకుడు కూడా ఉంటున్నాడు.

అయితే, యువతి బాయ్‌ఫ్రెండ్ లేని సమయంలో ఆదిత్య ఆనంద్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అతడి వేధింపులతో తీవ్రంగా విసిగిపోయిన ఆ విదేశీ యువతి భారత్ నుంచి తన సొంత దేశానికి వెళ్లిపోయింది. అక్కడ నెదర్లాండ్స్ ఎంబసీని ఆశ్రయించి తన ఆవేదనను వెళ్లగక్కింది.

►ALSO READ | విద్యార్థులపై AK-47తో కాల్పులా?.. పోలీసు సస్పెండ్

ఎంబసీ ద్వారా ఫిర్యాదు చేసిన అనంతరం, తిరిగి మూడు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన బాధితురాలు నేరుగా గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన వేధింపుల ఘటన మొత్తం పోలీసులకు వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆదిత్య ఆనంద్‌పై కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.