ట్యాంక్‌బండ్, వెలుగు: కుటుంబ సమస్యలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లాకు చెందిన సాప్ట్వేర్ ఇంజినీర్ సీతారాం రెడ్డి (36) బాచుపల్లిలో నివాసం ఉంటున్నాడు. కుటుంబ కలహాలతో ఇటీవల భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోవడం, ఇద్దరు పిల్లలను అత్తమామలు తీసుకెళ్లడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈక్రమంలో ఆదివారం ట్యాంక్‌బండ్‌లో దూకి సూసైడ్ చేసుకున్నాడు. సోమవారం అతడి డెడ్‌బాడీ లభ్యం కావడంతో పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.
