కొన్ని క్యారెక్టర్లకు కావాల్సినంత స్క్రీన్ ‌‌ స్పేస్ ‌‌ ఇవ్వలేకపోయారు

కొన్ని క్యారెక్టర్లకు కావాల్సినంత స్క్రీన్ ‌‌ స్పేస్ ‌‌ ఇవ్వలేకపోయారు

టైటిల్ ‌‌: అతిథి భూతోభవ
కాస్ట్ ‌‌: జాకీష్రాఫ్ ‌‌, ప్రతీక్ ‌‌ గాంధీ, షర్మిన్ ‌‌ సెగల్ ‌‌, దివినా ఠాకూర్ ‌‌ ‌‌, 
లాంగ్వేజ్:  హిందీ, ఫ్లాట్ ‌‌ఫాం:  జీ5
రన్ ‌‌టైం: 124 నిమిషాలు
డైరెక్షన్ ‌‌: హార్దిక్ ‌‌ గజ్జర్ ‌‌ ‌‌

శ్రీకాంత్ శిరోద్కర్ (ప్రతీక్ గాంధీ) ఒక స్టాండ్-అప్ కమెడియన్. అతను ఫ్లైట్ ‌‌ అటెండెంట్ ‌‌ నేత్రా బెనర్జీ (షర్మిన్ సెగల్)తో రిలేషన్​లో ఉంటాడు. శ్రీకాంత్ ‌‌... నేత్రను నెగ్లెట్ ‌‌ చేస్తుంటాడు. ఇలా ఉండగా మఖన్​సింగ్ (జాకీ ష్రాఫ్) అనే సిక్కు దెయ్యం శ్రీకాంత్ ‌‌కు కనిపిస్తుంది. మఖన్ ‌‌ తనకు ఒక సాయం చేయాలని అడుగుతాడు. ఆ దెయ్యం పరిచయంతో శ్రీకాంత్ ‌‌ జీవితం పెద్ద మలుపు తిరుగుతుంది. 1975లో చనిపోయిన తన తాతే, శ్రీకాంత్​లా మళ్లీ పుట్టాడు అనుకుంటాడు మఖన్ ‌‌. అయితే.. మఖన్ ‌‌ అడిగిన సాయం చేసేందుకు నేత్రతోపాటు తన ఫ్రెండ్ ‌‌ సుచరిత (దివినా ఠాకూర్)తో కలిసి ఉత్తరప్రదేశ్ ‌‌కి బయల్దేరుతాడు శ్రీకాంత్. అయితే.. ఈ జర్నీలో అతను నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసుకుంటాడు. ఆ జర్నీ వాళ్లకు జీవిత పాఠాలను నేర్పుతుంది. శ్రీకాంత్, నేత్ర దగ్గరవుతారు. ఇంతకీ ఆ దెయ్యం అడిగిన సాయం ఏంటి? శ్రీకాంత్ ఆ సాయం చేయగలిగాడా? లేదా?  

సినిమాలో ప్రతి సీన్​ని చాలా పర్ఫెక్ట్​‌‌గా తీసేందుకు ట్రై చేశారు. ఎమోషన్స్ ‌‌తోపాటు కామెడీకి కూడా ప్రయారిటీ ఇచ్చారు. ప్రతీక్ గాంధీ, జాకీ ష్రాఫ్ ఇద్దరూ పోటీ పడి నటించారు. కొన్నిసార్లు వీళ్ల మధ్య సీన్లు బాగా నవ్వు తెప్పిస్తాయి. అయితే.. కొన్ని క్యారెక్టర్లకు కావాల్సినంత స్క్రీన్ ‌‌ స్పేస్ ‌‌ ఇవ్వలేకపోయారు.