ఆర్టీఐ యాక్ట్​ను ఆగం చేస్తున్నరు : సోనియాగాంధీ

ఆర్టీఐ యాక్ట్​ను ఆగం చేస్తున్నరు : సోనియాగాంధీ

న్యూఢిల్లీ: ఆర్టీఐ సవరణలు చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్​ కమిషనర్ల అధికారాలను మోడీ సర్కార్​ఆగం చేస్తోందని కాంగ్రెస్​ ప్రెసిడెంట్ సోనియాగాంధీ ఫైరయ్యారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ సవరణలతో ఏ ఇన్ఫర్మేషన్​ కమిషనర్​ కూడా స్వతంత్రంగా వ్యవహరించడానికి వీలులేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీఐ సవరణలను తాము పార్లమెంట్​లో వ్యతిరేకించామని, బయట కూడా వీటి అమలును వ్యతిరేకిస్తామని ప్రకటించారు. ఆర్టీఐ తమకు అడ్డంకిగా మారిందని భావిస్తున్న మోడీ ప్రభుత్వం.. దానిపై తుది దాడిని ప్రారంభించిందని ఆరోపించారు. కీలకమైన ఈ పదవులకు ఉన్న ప్రాధాన్యాన్ని తగ్గిస్తే.. సెల్ఫ్ రెస్పెక్ట్​ ఉన్న ఏ అధికారి కూడా మానిటర్​ చేసే పరిస్థితుల్లో పని చేయడానికి ఇష్టపడరని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేసే ఇలాంటి చర్యలను తాము ఖండిస్తున్నామని, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోడీ సర్కార్ తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామన్నారు.