నాలుగు కోట్ల ఆస్థి ఇచ్చినా అన్నం పెట్టని కొడుకులు

నాలుగు కోట్ల ఆస్థి ఇచ్చినా అన్నం పెట్టని కొడుకులు

కొడుకులు పట్టించుకోవడం లేదంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఓ వృద్ధుడు ఆందోళనకు దిగాడు. ఇంటి ముందు టెంట్ వేసుకుని ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నాడు. హుస్నాబాద్ పట్టణానికి చెందిన కొత్తకొండ స్వామి భార్య మూడేళ్ల క్రితం చనిపోయింది. అప్పటినుంచే తానే స్వయంగా వంట చేసుకుని తింటున్నాడు. ఇద్దరు కుమారులకు చెరో రెండు కోట్ల ఆస్తిని పంచి ఇచ్చానన్నాడు స్వామి. పెద్ద కుమారుడికి అవసరం ఉంటే 10 లక్షలు అప్పు కూడా తీసుకువచ్చి ఇచ్చానన్నారు. అప్పు కట్టమని పెద్ద కుమారుడిని అడిగితే ఇల్లు తన పేరిట రాయాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పారు. పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన నిర్ణయం  ప్రకారం ఇద్దరు కుమారులు  సంవత్సరానికి 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెద్ద కుమారుడు పది లక్షల అప్పు తీర్చే వరకు నిరాహర దీక్ష కొనసాగిస్తానన్నారు కొత్తకొండ స్వామి. కొడుకులు పట్టించుకోవడం లేదంటూ కన్నీరు పెట్టుకున్నారు.