20 వేలమందికి ఉపాధితో పాటు వసతి కల్పించిన సోనూసూద్

20 వేలమందికి ఉపాధితో పాటు వసతి కల్పించిన సోనూసూద్

లాక్డౌన్ వల్ల చాలామంది వలస కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయారు. వారందరిని మానవత్వంతో సొంత ఊళ్లకు చేర్చుతున్నాడు నటుడు సోనూసూద్. వలస కార్మికులకు సహాయం చేయడానికి ఆయన ‘ప్రవాసి రోజ్ గార్’ అనే జాబ్ పోర్టల్‌ను ప్రారంభించాడు. ఈ జాబ్ పోర్టల్ ద్వారా నోయిడాలోని గార్మెంట్ యూనిట్‌లో 20 వేల మందికి ఉపాధి కల్పించారు. వారందరికి ఇప్పుడు వసతి సౌకర్యం కూడా కల్పించనున్నట్లు సోనూసూద్ సోమవారం ట్వీట్ చేశారు. దరఖాస్తు విధానం ద్వారా ఈ వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

‘ప్రవాసి రోజ్ గార్ ద్వారా నోయిడాలోని వస్త్ర యూనిట్లలో 20,000 మంది వలస కార్మికులకు ఉద్యోగాలు కల్పించాం. ఇప్పుడు వారందరికి వసతి సౌకర్యం కల్పించడం నాకు చాలా ఆనందంగా ఉంది. NAEC అధ్యక్షుడు శ్రీ లలిత్ తుక్రాల్ సహకారంతో.. ఈ వసతిని కల్పిస్తున్నాం’ అని సోనూ ట్వీట్ చేశాడు.

లాక్డౌన్ వల్ల దేశంలో ఎక్కడెక్కడో చిక్కుకున్న వలసకార్మికులను స్వస్థలాలకు చేర్చడానకి సోనూసూద్ ట్రావెలింగ్ ఏర్పాట్లను చేశాడు. ఆ తర్వాత వివిధ ఉపాధి సంస్థలతో కలసి వలస కార్మికుల కోసం జాబ్ పోర్టల్‌ను ప్రారంభించాడు.

For More News..

సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి సీబీఐ సమన్లు

కరోనాను జయించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం

తెలంగాణలో మరో 1,842 కరోనా కేసులు