ప్రొఫెషనల్స్ కోసం కాస్ట్‌లీ ఫోన్ రిలీజ్ చేసిన సోని

ప్రొఫెషనల్స్ కోసం కాస్ట్‌లీ ఫోన్ రిలీజ్ చేసిన సోని
  • సోనీ ఎక్స్‌పీరియా ప్రో ధర రూ.1.8 లక్షలు
  • ఫోన్ ను ఓఎల్ఈడీ డిస్‌ప్లే మానిటర్  తరహాలో వాడుకోచ్చు
  • 5జీ కనెక్టివిటీకి కూడా సపోర్ట్ చేస్తుంది

ప్రముఖ ఎలక్ర్ట్రానిక్ దిగ్గజం సోని హైఎండ్ క్వాలిటీ వీడియోలు.. ఫోటోలు కోరుకునే వారి కోసం.. ముఖ్యంగా ఫోటో గ్రాఫర్లను దృష్టిలో పెట్టుకుని ఖరీదైన స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. సోనీ ఎక్స్‌పీరియా ప్రో ధర రూ.1.8 లక్షలు, ఈ స్మార్ట్ ఫోన్ ను ఓఎల్ఈడీ డిస్‌ప్లే మానిటర్  తరహాలో కూడా వాడుకోచ్చు.. అంతేకాదు అప్ కమింగ్ టెక్నాలజీ మార్పులను దృష్టిలో పెట్టుకుని 5జీ కనెక్టివిటీకి కూడా సపోర్ట్ చేసేలా ఫోన్ ను డిజైన్ చేసింది. డేటాను కెమెరా నుంచే నేరుగా ఎఫ్.టి.పికి బదిలీ చేయొచ్చు.

ఆకట్టుకునే హైఎండ్ ఫీచర్స్
హైఎండ్ మొబైల్ కెమెరాల్లో ప్రొఫెషనల్స్ కోసం డిజైన్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల 4కే హెచ్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంది. సోనీ ఎక్స్‌పీరియా ప్రో ఆండ్రాయిడ్ 10పై నడుస్తుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 రక్షణ ఏర్పాటు ఉంది. క్వాల్కాం స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది.  కెపాసిటీ 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌. దీన్ని మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఫోటోగ్రఫీ కోసం సోనీ ఎక్స్‌పీరియా ప్రోలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 12ఎంపీ ఎఫ్/ 1.7లెన్స్‌తో ఎక్స్‌మోర్ ఆర్‌ఎస్‌ను కలిగి ఉంది. మిగిలిన రెండు కెమెరాలు 124-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూ (ఎఫ్‌ఓవి)తో ఎఫ్ / 2.2 లెన్స్, ఎఫ్/2.4 లెన్స్‌తో 12 మెగాపిక్సెల్ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం సోనీ ఎక్స్‌పీరియా ప్రో ముందు భాగంలో ఎఫ్ / 2.0 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా కలిగిఉంది.

కనెక్టివిటీ

సోనీ ఎక్స్‌పీరియా ప్రోలో కనెక్టివిటీ  5జీ, 4జీ,  ఎల్‌టిఇ, వై-ఫై6, బ్లూటూత్ 5.1, జిపిఎస్/ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి, మైక్రో-హెచ్‌డిఎంఐ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ ఫోన్ డాల్బీ అట్మోస్ ఆడియో టెక్నాలజీతో నడుస్తుంది. ఇది ఎక్స్‌పీరియా అడాప్టివ్ ఛార్జింగ్, యుఎస్‌బి పవర్ డెలివరీ(పిడి) ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ కలిగిఉంది. ఇది 225 గ్రాముల బరువు కలిగి ఉంది. అలాగే సోనీ ఎక్స్‌పీరియా లో ప్రస్తుతం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్‌తో ఉన్న ఈ వేరియంట్ ధరను సుమారు రూ.1,82,500గా నిర్ణయించారు. ఈ ఫోన్ ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. అమెజాన్, బీఅండ్‌హెచ్ ఫొటో వీడియో, సోనీ ఆన్ లైన్ స్టోర్లలో కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉంది.