క్రికెట్కు వీడ్కోలు పలికిన హషీమ్ ఆమ్లా

 క్రికెట్కు వీడ్కోలు పలికిన హషీమ్ ఆమ్లా

దక్షిణాఫ్రికా అత్యుత్తమ బ్యాటర్‌లలో ఒకరైన హషీమ్ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 39 ఏళ్ల ఆమ్లా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు. రెండు దశాబ్దాల కెరీర్‌లో ఆమ్లా ఇప్పటివరకు 181 వన్డేలు ఆడాడు. వన్డేల్లో 8113 పరుగులు చేశాడు. వీటిలో  27 సెంచరీలు,  39 హాఫ్ సెంచరీలున్నాయి. 124 టెస్టులు ఆడిన  ఆమ్లా 9282 పరుగులు చేశాడు. ఇందులో  28 సెంచరీలుండగా,41 హాఫ్ సెంచరీలున్నాయి.

దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక టెస్టు పరుగులు చేసిన రెండో ఆటగాడు హషీమ్ ఆమ్లా నిలిచాడు. ముందుగా జాక్వెస్ కలిస్ ఉన్నాడు. 2012లో ది ఓవల్‌లో ఇంగ్లండ్‌పై ఆమ్లా చేసిన 311పరుగులు అతని కెరీర్ లో అత్యుత్తమమైనది.  ఇక 44 టీ20ల్లో 1277 రన్స్ చేసి 8 హాఫ్ సెంచరీలు బాదిన ఆమ్లా ఐపీఎల్లో పంజాబ్ తరుపున ఆడాడు.