ఇండియా చాంపియన్స్‎పై ఏబీడీ తుఫాన్ ఇన్సింగ్స్.. భారీ స్కోర్ చేసిన దక్షిణాఫ్రికా చాంపియన్స్

ఇండియా చాంపియన్స్‎పై ఏబీడీ తుఫాన్ ఇన్సింగ్స్.. భారీ స్కోర్ చేసిన దక్షిణాఫ్రికా చాంపియన్స్

బ్రిటన్: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగులో భాగంగా భారత్ చాంపియన్స్‎తో జరుగుతోన్న మ్యాచులో దక్షిణాఫ్రికా చాంపియన్స్ బ్యాటింగ్‎లో రాణించింది. స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ (63) తుపాన్ ఇన్సింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది దక్షిణాఫ్రికా చాంపియన్స్. ఇండియా చాంపియన్స్ బౌలర్లలో యూసఫ్ పఠాన్, పీయూష్​చావ్లా చెరో రెండు వికెట్లు తీయగా.. అభిమన్యన్ మిథున్ ఒక వికెట్ పడగొట్టాడు.

ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‎కు దిగిన దక్షిణాఫ్రికా చాంపియన్స్‎కు శుభారంభం దక్కింది. ఓపెన్లర్లు హషీమ్ ఆమ్లా (22), రుడాల్ఫ్ (24) మంచి స్టార్టింగ్ అందించారు. అనంతరం మిస్టర్ 360 ఏబీడీ చెలరేగి ఆడాడు. కేవలం 30 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 63 పరుగులు చేశాడు. చివర్లో జేజే స్మట్స్ (30),  మోర్నే వాన్ వైక్ (18) రాణించడంతో దక్షిణాఫ్రికా చాంపియన్స్ 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 209 పరుగుల లక్ష్యంతో భారత్ చాంపియన్స్ ఛేదనకు దిగింది.