క్రికెట్ కు గుడ్ బై చెప్పిన దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్

దక్షిణాఫ్రికా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ డేల్‌ స్టెయిన్‌ తన క్రికెట్ కెరీర్‌ కు ఫుల్‌ స్టాప్‌ పెట్టాడు. ఈ ఫాస్ట్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌..తన అంతర్జాతీయ క్రికెట్‌ కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తాను వైదొలుగుతున్నట్లు డేల్‌ స్టెయిన్‌ ప్రకటించాడు. తన ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించాడు.

38 ఏళ్ల స్టెయిన్ తన కెరీర్ లో 93 టెస్టులాడి 439 వికెట్లు సాధించాడు. వాటిలో అత్యుత్తమం 7/51. వన్డేల్లో 125 మ్యాచ్ లాడి 196 వికెట్లు, టీ20 అంతర్జాతీయ పోటీల్లో 47 మ్యాచ్ ల్లో 64 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ తోనూ స్టెయిన్ కు అనుబంధం ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్, డెక్కన్ చార్జర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

ఒకప్పుడు వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగిన స్టెయిన్ గాయాలబారినపడ్డాడు. పలు సర్జరీల తర్వాత ఆటలో మళ్లీ అడుగుపెట్టినా, మునుపటి వాడి లోపించింది. దానికితోడు గాయాలు తిరగబెట్టడం కూడా స్టెయిన్ ప్రతిష్ఠను మసకబార్చింది. ఈ క్రమంలోనే అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించినట్టు తెలుస్తోంది.