జనం మెచ్చిన కర్రీలు: కీమా ఫస్ట్..పప్పు లాస్ట్..ప్రపంచ ర్యాకింగ్స్ విడుదల

జనం మెచ్చిన కర్రీలు: కీమా ఫస్ట్..పప్పు లాస్ట్..ప్రపంచ ర్యాకింగ్స్ విడుదల

కీమా అంటే ఏమిటో దాని రుచి ఎలాంటి దాదాపు భారీతీయులకు తెలుసు. ప్రఖ్యాత భారతీయ  వంటకాల్లో ఇదొకటి. ప్రపంచ వ్యాప్తంగా వంటకాలను గుర్తించి వాటికి ర్యాంకింగ్స్ ఇచ్చే వంటల గైడ్ బెస్ట్ అట్లాస్ తాజా ర్యాంకింగ్ లలో 9 భారతీయ వంటకాలతో ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల లిస్ట్ ను ప్రకటించింది. ఇందులో కీమా టాప్ 10లో ఉండగా.. కోర్మా, దాల్ తడ్కా టాప్ 30లో ఉన్నాయి. 

బెస్ట్ అట్లాస్ ప్రకటించిన ఏప్రిల్ 24 ర్యాంకింగ్ ప్రకారం.. మన దేశానికి చెందిన తొమ్మిది వంటకాలు అంత్యంత రుచి గల వంటకాలుగా గుర్తించారు. అందులో రుచికరమై కీమా ప్రపంచ టాప్ 10 వంటకాల్లో 6వ స్థానాన్ని కైవసం చేసుకుంది.చింగ్రీ మలై కర్రీ అనే బెంగాలీ వంటకం 18వ స్థానంలో నిలిచింది. సుగంధ కోర్మా 22 స్థానం, విందాలు 26వ స్థానం, దాల్ తడ్కా 30వస్థానం, సాగ్ పనీర్ 32వ స్థానం, షాహీ పనీర్ 34వ స్థానం, మిసాల్ 38వ స్థానంలో భారతీయ పాక శాస్త్ర వైవిధ్యాన్ని హైలైట్ చేస్తూ ప్రపంచ వ్యాప్త భోజన ప్రియుల దృష్టిని ఆకర్షించాయి.   

కీమా తయారీ 

అత్యంత చిన్న చిన్న ముక్కలుగా చేసిన మాంసంతో చేసిన ప్రసిద్ధ భారతీయ వంటకం. మంచి సువాసన గల కర్రీ. మేక, గొడ్డు మాంసం లేదా చికెన్ మాంసాన్ని మసాలాలు దట్టించి , ఉల్లిపాయలు, టమోటాలతో కలిపి వండుతారు. తక్కువ ఫ్లేంలో చాలా నెమ్మదిగా వండటం కీమా వంటకంలో చాలా కీలకమైన ప్రక్రయ. ఇది మాంసంతో కలిసి పోయి రుచికరంగా చేస్తుంది. మంచి గ్రేవీతో అన్నం లేదా రోటీ లేదా పరాఠా వంటి వాటితో కలిపి తినొచ్చు. దీనికి కొన్ని ప్రాంతాల్లో సమోసాలుగా కూడా వినియోగిస్తారట. 


టేస్ట్ అట్లాస్ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ రైస్ పుడ్డింగ్‌ల కోసం తన ర్యాంకింగ్‌లను ఆవిష్కరించింది, మూడు భారతీయ స్వీట్ డెలికేసీలు టాప్ 10లో స్థానాలను పొందాయి. ఈ ర్యాంకింగ్‌లు భారతదేశ పాకశాస్త్ర శ్రేష్ఠతకు మరియు అటువంటి గౌరవనీయమైన గుర్తింపుల ద్వారా అందుకునే కృతజ్ఞతకు నిదర్శనంగా నిలుస్తాయి.