- అధికారులకు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఆదేశం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎండలు మండుతున్న నేపథ్యంలో రైల్వేలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఆదేశించారు. సోమవారం రైల్ నిలయంలో జోన్ వ్యాప్తంగా రైలు కార్యకలాపాల భద్రతపై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రైల్ థర్మామీటర్ల వినియోగాన్ని ముమ్మరం చేయాలని, ఎక్కువ టెంపరేచర్లను తట్టుకునేలా, రైళ్ల కదలికలను సజావుగా సాగేలా ట్రాక్‌లను బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. ట్రాక్ పటిష్టతను కాపాడటానికి బాలస్ట్ రీకూపింగ్, ఫిల్లింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
రైళ్లలో అగ్ని ప్రమాదాలపై సమగ్ర విశ్లేషణ చేసి, వాటిని నివారించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. రైల్వే బ్రిడ్జిల దగ్గర, నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతా మార్గదర్శకాలు, జాగ్రత్తలను పాటించాలని ఆదేశించారు. ప్రమాదాలను నివారించడానికి రైళ్లలోని విద్యుత్ కేబుళ్లకు ట్యాంపర్ -ప్రూఫ్ లాకింగ్ తప్పనిసరన్నారు.
ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జీఎం సత్య ప్రకాష్, ప్రధాన విభాగాధిపతులు పాల్గొన్నారు. విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్ల డీఆర్‌ఎంలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యారు.ఫోటో: సిటీ బ్యూరో ఫోల్డర్‌లో రైల్ సెక్యూరిటీ అని ఉంది.

