హైదరాబాద్,వెలుగు: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు రెండ్రోజులు కస్టడీకి తీసుకున్నారు. మొదటి రోజు కస్టడీలో భాగంగా గురువారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య నాయక్‌తో కూడిన ప్రత్యేక బృందం ఉదయ్‌కృష్ణారెడ్డిని విచారిస్తోంది.
కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు కస్టడీ కొనసాగనుంది. కాగా, మొదటి రోజు కస్టడీలో పూర్తిగా ఉదయ్‌కృష్ణారెడ్డి వ్యక్తిగత విషయాలతో పాటు సివిల్స్‌కు సిద్ధమవుతున్న సమయంలో కోచింగ్‌తీసుకున్న ప్రాంతాల గురించి ఆరా తీసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అశోక్‌నగర్‌లో కోచింగ్ తీసుకుంటున్న సమయంలో పరిచయమైన మహిళకు సంబంధించిన వివరాలతో స్టేట్‌మెంట్‌రికార్డ్ చేసినట్లు సమాచారం. కాగా, ఉదయ్ కృష్ణారెడ్డి వినియోగించిన మరొక మొబైల్ ఫోన్‌కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
