- మంత్రి పదవిపై చర్చ.. అవకాశం ఇవ్వాలని కోరినట్టు సమాచారం
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ కమిటీ హాల్‌లో జరిగే కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసి యేషన్ (సీపీఏ) సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన స్పీకర్.. మంగళవారం రాజాజీ మార్గ్‌లోని ఖర్గే నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు.
దాదాపు అర గంటకుపైగా జరిగిన భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థి తులు, ప్రభుత్వ విధానాలు, ఇతర అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలిసింది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం మంత్రి వర్గ విస్తరణపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. మంత్రివర్గంలో తనకు అవకాశం కల్పించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఖర్గేను కోరినట్లు సమాచారం. ఖర్గేతో భేటీ అనంతరం స్పీకర్ సీపీఏ కాన్ఫరెన్స్ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.
