హైదరాబాద్‎లో ఫుడ్ సెంటర్లపై స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్‎లో ఫుడ్ సెంటర్లపై స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 59వ రోజు ఆదివారం చిన్నారులు ఎక్కువగా సందర్శించే ఫుడ్ సెంటర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్లే జోన్లు, పార్కులు, ఫుడ్ కోర్టులు, బేకరీల్లో తనిఖీలు నిర్వహించారు. నాణ్యతపై అనుమానం ఉన్న ఫుడ్ నమూనాలను సేకరించి, ల్యాబ్‎కి  పంపారు. 

81 సెంటర్లపై దాడులు జరిపిన అధికారులు రూల్స్​బ్రేక్​చేసిన 14 మందికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. సరైన లేబులింగ్ఉండాలని, ఆహార పదార్థాలను సైంటిఫిక్​పద్ధతిలో స్టోర్​చేయాలని, పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టడంతో పాటు, దానికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.