గోదావరి పుష్కరాలపై స్పెషల్ ఫోకస్

గోదావరి పుష్కరాలపై స్పెషల్ ఫోకస్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం చేపట్టే అభివృద్ధి పనుల కోసం ఎండోమెంట్, రోడ్స్​ అండ్​ బిల్డింగ్స్, ఇరిగేషన్​అండ్​ సీఏడీ శాఖల తరఫున ఆఫీసర్లు మొత్తం రూ.376 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు.

కాగా, జిల్లాలో తొమ్మిది చోట్ల ప్రత్యేక పుష్కర ఘాట్లను ఏర్పాటు చేసేందుకు ఆఫీసర్లు ప్లాన్​ చేస్తున్నారు. భద్రాచలం, దుమ్ముగూడెం, మణుగూరు, పినపాక, అశ్వాపురం, బూర్గంపహడ్​ మండలాల్లోని భద్రాచలం, పర్ణశాల, మోతేగడ్డ, దుమ్ముగూడెం, చిన్నరావిగూడెం, కొండాయిగూడెం, చింతల బయ్యారం, నెల్లిపాక, చింత్రియాల ప్రాంతాల్లో ప్రధాన ఘాట్లను నిర్మించేందుకు ఆఫీసర్లు ప్రపోజల్స్​ తయారు చేశారు.

ఇందులో బూర్గంపహడ్​ మండలం మోతేగడ్డ ప్రాంతంలో వీఐపీ ఘాట్ ఏర్పాటు చేయనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలో జరిగే గోదావరి పుష్కరాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే కలెక్టర్ అంకిత్ పలు శాఖల ఆఫీసర్లతో గోదావరి పుష్కరాలపై ఇటీవలి కాలంలో స్పెషల్​ మీటింగ్ నిర్వహించారు.