‘పుష్ప- 2’ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్.. బన్నీ లుక్ నెక్ట్స్ లెవల్

‘పుష్ప- 2’ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్.. బన్నీ లుక్ నెక్ట్స్ లెవల్

 ‘పుష్ప 2’ అంటూ ఎంతో కాలంగా ఊరిస్తున్న సుకుమార్ టీం ఎట్టకేలకు ఓ స్పెషల్ వీడియోను వదిలారు. ఇటీవల విడుదలైన ఓ వీడియోలో తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న పుష్ప ఎక్కడా? అంటూ క్యూరియాసిటీని పెంచాడు. 

తాజాగా విడుదలైన వీడియోలో ‘పది బుల్లెట్లు దూసుకుపోయి రక్తపు మడుగులో ఉన్న పుష్ప దుస్తులు దొరికాయి. ఇంతకీ అతను బతికి ఉన్నాడా లేదా?’ అనే సందిగ్ధత మధ్య హీరో ఎక్కడున్నాడో రివీల్ చేశారు. హీరో శేషాచలం అడవుల్లో ఉన్నట్టుగా చూపించారు. 

‘‘అడవిలో జంతువులు రెండడుగులు వెనక్కి వేశాయంటే పులి వస్తుందని అర్థం. అదే పులి రెండడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వస్తున్నాడని అర్థం’’ అంటూ బ్యాగ్రౌండ్ లో వచ్చే డైలాగ్ ఆకట్టుకుంది. వీడియో చివర్లో బన్నీ మాస్ లుక్కులో కనిపించి ఆకట్టుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. పార్ట్ 2 కి సైతం దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు. 

https://youtu.be/Xcw4dkILsmk