ఢిల్లిలో స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ సర్వీస్ విమానం గాల్లోకి ఎగరే వరకు ఏసీ ఆన్ చేయలేదు. ఢిల్లీ నుండి దర్భన్‌కు ప్రయాణించే స్పైస్‌జెట్(SG 486) లో ఏసీ ఆన్ చేయకుండా గంటసేపు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బయట ఉంటేనే ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి అలాంటిది. పూర్తిగా క్లోజ్డ్ ఫ్లైట్ లో గంటసేపు ప్రయాణికులు నరకయాతన పడ్డారు. గాలి ఆడక ఫ్లైట్ లో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. అట్టాలు, పేపర్ ప్యాడ్స్ పట్టుకొని గాలి విసురుకున్నారు. విమానం బయల్దేరే ముందు దాదాపు గంట సేపు ఏసీ పని చేయలేదు. టేక్ ఆఫ్ అయ్యే ముందే ఏసీ ఆన్ చేశారు. ప్యాసింజర్లు ఇబ్బందులకు గురయ్యారు. ఫ్లైట్ సర్వీస్ పై ప్రయాణికులు మండిపడుతున్నారు.
