డోప్ టెస్టులో విఫలమైన అథ్లెట్స్ ఎస్. ధనలక్ష్మీ, ఐశ్వర్యబాబు

డోప్ టెస్టులో విఫలమైన అథ్లెట్స్ ఎస్. ధనలక్ష్మీ, ఐశ్వర్యబాబు

కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనే స్ర్పింటర్ ఎస్. ధనలక్ష్మీ, ట్రిపుల్ జంపర్ ఐశ్వర్యబాబు డోప్ టెస్టులో విఫలమయ్యారు. బుధవారం నిర్వహించిన పరీక్షల్లో ధనలక్ష్మీ, ఐశ్వర్యబాబు నిషేధిత ఉత్ర్పేరకాలు వాడినట్లు తేలింది. వీరిద్దరు డోప్ శాంపిల్స్ లో అనబోలిక్ స్టిరాయిడ్స్, ఒస్టారిన్ అనే నిషేధిత డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించారు. దీంతో ఈ నెల 28 నుంచి జరిగే కామన్వెల్త్ గేమ్స్ నుంచి  ధనలక్ష్మీ, ఐశ్వర్యబాబులను తప్పించారు. 

డోప్ టెస్టులో విఫలమవడం రెండోసారి..
ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో  టర్కీలో ట్రేయినింగ్ సందర్భంగా వరల్డ్ అథ్లెటిక్స్‌ అసోషియేషన్ కు చెందిన అథ్లెటిక్స్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ధనలక్ష్మి శాంపిల్స్‌ సేకరించింది. ఆ తర్వాత జూన్‌లో తిరువనంతపురంలో శిక్షణ శిబిరంలో  జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ  మరోసారి ఆమె శాంపిల్స్‌ తీసుకుంది. ఈ రెండు శాంపిల్స్‌లోనూ నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నట్లు తేలింది. అటు జూన్ లో చెన్నైలో జరిగిన జాతీయ అంతర్‌ రాష్ట్ర అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ఐశ్వర్యబాబుకు  నాడా అధికారులు డోప్ టెస్టు నిర్వహించారు. ఈ పరీక్షలో ఐశ్వర్య పాజిటివ్‌గా తేలింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ట్రిపుల్‌ జంప్‌లో ఈవెంట్లో లాంగ్‌జంప్‌లో ఐశ్వర్య విన్నర్గా నిలిచింది. ఆయా పోటీల అనంతరం ఆమె నుంచి శాంపిల్స్‌ సేకరించారు. రెండు పరీక్షల్లోనూ ఆమె విఫలమైంది.  ప్రస్తుతం రెండుసార్లు డోప్‌ పరీక్షలో విఫలమైన ధనలక్ష్మీ, ఐశ్వర్యలపై తాత్కాలిక సస్పెన్షన్‌ విధించారు.  

ధనలక్ష్మీ స్థానంలో జిల్నా..
ధనలక్ష్మీ ఈ ఏడాది జూన్‌ 26న కొసనోవ్‌ స్మారక అథ్లెటిక్స్‌ మీట్‌లో 200 మీటర్ల పరుగును 22.89 సెకన్లలో  పూర్తి చేసి రికార్డు సృష్టించింది. కెరీర్‌లో  అత్యుత్తమ టైమింగ్‌ నమోదు చేసి ..గోల్డ్ మెడల్ను సాధించింది. సరస్వతి సాహా, హిమ దాస్‌ తర్వాత 23 సెకన్లలోపు టైమింగ్‌ నమోదు చేసిన మూడో భారత అథ్లెట్‌గా ధనలక్ష్మీ రికార్డు క్రియేట్ చేసింది. అయితే ప్రస్తుతం ధనలక్ష్మిపై వేటు పడటంతో ఆమె స్థానంలో ఎమ్‌.వి. జిల్నా కామన్వెల్త్‌ గేమ్స్లో పాల్గొననుంది. చెన్నై పోటీల్లో ట్రిపుల్‌ జంప్‌లో 14.14 మీటర్లతో ఐశ్వర్య నేషనల్ రికార్డు క్రియేట్ చేసింది. లాంగ్‌ జంప్‌ అర్హత రౌండ్లో 6.73 మీటర్లు దూకింది. దిగ్గజ అథ్లెట్‌ అంజూ బాబీ జార్జ్‌ తర్వాత ఐశ్వర్య భారత అత్యుత్తమ లాంగ్‌ జంపర్‌గా ఐశ్వర్య నిలిచింది.