KKR vs DC: ఆ భయం ఉండాలి: ఫ్లయింగ్ కిస్ సెలెబ్రేషన్ ఆపేసిన హర్షిత్ రాణా

KKR vs DC: ఆ భయం ఉండాలి: ఫ్లయింగ్ కిస్ సెలెబ్రేషన్ ఆపేసిన హర్షిత్ రాణా

ఐపీఎల్ లో ఫ్లయింగ్ కిస్  సెలెబ్రేషన్ తో హర్షిత్ రాణా బాగా వైరల్ అయ్యాడు.మార్చి 23వ తేదీ శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో  జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో హర్షిత్ రాణా అత్యుత్సహన్ని ప్రదర్శించాడు. సన్‌రైజర్స్ ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్ లను ఔట్ చేసిన అనంతరం వారిద్దరి వైపు కోపంతో చూస్తూ  ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు.

ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఐపీఎల్ నిర్వాహకులు ఐపీఎల్ ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం లెవల్-1 తప్పిదానికి పాల్పడ్డాడని మ్యాచ్ రిఫరీ తేల్చాడు. రెండు తప్పిదాలకు గానూ 10 శాతం, 50 శాతం చొప్పున మ్యాచ్‌ ఫీజులో 60 శాతం కోత విధించారు. మ్యాచ్ రిఫరీ విధించిన ఆంక్షలను పేసర్ అంగీకరించాడు.

తాజాగా హర్షిత్ రాణా అలాంటి తప్పునే రిపీట్ చేసే ప్రయత్నం చేశాడు. ఐపీఎల్ లో భాగంగా నిన్న (ఏప్రిల్ 29) ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ చేసిన పని వైరల్ అవుతుంది. రాణా బౌలింగ్ లో అభిషేక్ పోరెల్ వికెట్లను వదిలేసి వెనక్కి షాట్ ఆడే క్రమంలో క్లీన్ బౌల్డయ్యాడు. సంతోషాన్ని తట్టుకోలేకపోయిన రాణా .. తనకు అలవాటైన ఫ్లయింగ్ కిస్  సెలెబ్రేషన్ ఇవ్వాలని చూశాడు.

Also Read:మయాంక్ వచ్చేస్తున్నాడు.. వరల్డ్ కప్‌లో చోటు దక్కుతుందా..?

వెంటనే తనను తాను నియంత్రించుకొని సెలెబ్రేషన్ ను ఆపేశాడు. ప్రస్తుతం రాణా చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్స్ రకరకాలుగా ఈ యువ బౌలర్ పై ట్రోల్ల్స్ చేస్తున్నారు. ఆ భయం ఉండాలని సెటైర్ వేస్తున్నారు. ఈ మ్యాచ్ లో తన నాలుగు ఓవర్ల స్పెల్ లో 28 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు.