V6 News

Hari Hara Veeramallu Update: హరి హర వీరమల్లు సడెన్ అప్డేట్.. టీజర్ డేట్ వచ్చేసింది!

Hari Hara Veeramallu Update: హరి హర వీరమల్లు సడెన్ అప్డేట్.. టీజర్ డేట్ వచ్చేసింది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) చేస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులలో హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu). ఆయన కెరీర్ లో వస్తున్న మొదటి పీరియాడిక్ డ్రామా ఇది. ఈ సినిమాలో ఆయన రాబిన్ హుడ్ పాత్రలో కనిపిస్తారని టాక్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తుండగా.. డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే యాభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. పవన్ ఎన్నికల ప్రచారం కారణంగా లేట్ అవుతూ వస్తోంది. 

ఇక చాలా కాలంగా ఈ సినిమా నుండి అప్డేట్స్ కూడా లేకపోవడంతో.. సినిమా ఆగిపోయింది అనే కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ, నిర్మాత ఏఎం రత్నం మాత్రం ఆ వార్తల్ని ఖండిస్తూ వచ్చాడు. ఇక ఎన్నికలు అయ్యేంతవరకు ఈ సినిమా నుండి అప్డేట్స్ ఏమీ ఉండవు అనుకున్న వేల.. తాజాగా సర్‌ప్రైజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ధర్మం కోసం యుద్ధం.. అంటూ కొత్త పోస్టర్  రిలీజ్ చేస్తూ.. మే 2 ఉదయం 9 గంటలకు అప్డేట్ రానున్నట్లు తెలిపారు. అయితే.. ఈ అప్డేట్ లో ఎక్కడ టీజర్ అని మెన్షన్ చేయలేదు. కానీ, టీజరే రానుంది అని ఫిక్స్ అవుతున్నారు.

కారణం.. చాలా కాలంగా  హరి హర వీరమల్లు టీజర్ గురించి ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. దాంతో ఖచ్చితంగా మే 2న టీజర్ రానుంది అని ఫిక్స్ అవుతున్నారు. ఇక అనుకోకుండా వచ్చిన అప్డేట్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. టీజర్ మోతెక్కిపోవాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.