
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్(Nikhil Siddarth) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ స్పై(Spy). ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు మొదటిరోజు మిక్సుడ్ టాక్ వచ్చింది. అయినా కూడా మంచి కలక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. మొదటిరోజు ఈ సినిమా ఏకంగా రూ.11.7 కోట్లు వసూళ్లని సాధించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ హీరో నిఖిల్ తాజాగా ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
'కార్తికేయ 2(Karthikeya2)' సినిమా తొలిరోజు రూ.8.50 కోట్లు కలెక్ట్ చేయగా.. 'స్పై' మూవీ ఏకంగా రూ.11.7 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో.. నిఖిల్ తన కెరీర్ లో అత్యధిక ఫస్ట్ డే వసూళ్లని అందుకున్నాడు. అయితే ఈ సినిమాకు మొదటిరోజు కలెక్షన్స్ అద్భుతంగా వచ్చాయి కానీ.. ఈ వీకెండ్ గడిస్తే గానీ సినిమా విషయం ఏంటనేది చెప్పలేం. ఎందుకంటే.. విడుదల తరువాత స్పై మూవీకి మిక్సుడ్ టాక్ వచ్చింది. ఇది సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరి స్పై మూవీ విషయంలో నిఖిల్ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో తెలియాలంటే.. సోమవారం వరకు ఆగాల్ససిందే.