హైదరాబాద్, వెలుగు: శ్రీ చైతన్య విద్యాసంస్థలు కావూరి హిల్స్ జోన్ ఆధ్వర్యంలో ‘ రోర్–రైజ్ ఆఫ్ అచీవర్స్ అండ్ రాక్‌స్టార్స్ 2కె26’ ఫ్రెషర్స్ డే వేడుకలు, ఇంటర్ కాలేజీ క్రీడా పోటీలు గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, డీసీపీ రితిరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.
సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఓటమికి భయపడకుండా లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు. శ్రీచైతన్య అకాడమిక్ డైరెక్టర్ సస్మా బొప్పన, డైరెక్టర్లు శ్రీధర్, నాగేంద్ర, అకాడమిక్ డైరెక్టర్ సీమా బొప్పన మాట్లాడుతూ.. క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధమైన చదువు, నాణ్యమైన బోధనతోనే జాతీయ స్థాయిలో విజయాలు సాధ్యమవుతాయని చెప్పారు.
విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసానికీ శ్రీచైతన్య ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడా కార్యక్రమాలు ఆకట్టుకోగా, యాంకర్ రవి వ్యాఖ్యాతగా వ్యవహరించి కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు.
