గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఇందిరానగర్, శాంతి నగర్ టర్నింగ్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని వ్యాన్ ఢీ కొట్టడంతో ద్వారకా నగర్కు చెందిన వెన్నెల అనే మహిళ చనిపోయింది. రామగుండం శ్రీ చైతన్య హైస్కూల్లో వెన్నెల టీచర్గా పని చేస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
స్కూటీపై స్కూల్కు వెళుతుండగా వెనుక వైపు వచ్చిన వ్యాన్ ఢీ కొట్టినట్లు సీసీ టీవీ ఫుటేజీల్లో స్పష్టమైంది. తీవ్రంగా గాయపడిన వెన్నెలను స్థానికులు ప్రభుత్వ జనరల్ అసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గోదావరిఖని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెన్నెలకు భర్త, మూడు సంవత్సరాల కొడుకు ఉన్నారు.
ఖమ్మం నగరంలోని వైరా రోడ్ గోపాలపురం మెయిన్ రోడ్పై కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీ కొని మోటార్ సైకిల్పై వెళుతున్న వేణుగోపాల్ నగర్ - 2 కు చెందిన తెలకపల్లి సాంబయ్య(35) స్పాట్లోనే చనిపోయాడు. తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. వాహనం ఢీ కొట్టిన తీవ్రతకు మృతదేహం ఛిద్రమైపోయింది.

