క్లీన్‌‌ రీఫ్రెషింగ్‌‌ స్టోరీగా.. శ్రీ చిదంబరం గారు

క్లీన్‌‌ రీఫ్రెషింగ్‌‌ స్టోరీగా.. శ్రీ చిదంబరం గారు

వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా వినయ్ రత్నం దర్శకత్వంలో వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మించిన చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’.  శుక్రవారం విడుదలైన సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా శనివారం థ్యాంక్స్ మీట్ నిర్వహించారు.  తన  మొదటి సినిమాకే  మంచి అప్లాజ్‌‌ రావడం ఎంతో సంతోషంగా ఉందని వంశీ తుమ్మల అన్నాడు. హీరోయిన్  సంధ్యా  వశిష్ట మాట్లాడుతూ ‘నేను పోషించిన  లీల పాత్ర అందరూ నచ్చిందని చెప్పడం హ్యాపీగా ఉంది.

 క్లీన్‌‌ రీఫ్రెషింగ్‌‌ స్టోరీగా  అందరి హృదయాలకు హత్తుకుంటుంది’ అని  చెప్పింది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతోపాటు  ఈ సినిమా చూసి మలయాళం నుంచి అప్రిసియేషన్‌‌ వస్తుండటం సంతోషంగా ఉందని దర్శకుడు వినయ్ రత్నం అన్నాడు.  తమ  ప్రయత్నంలో ఉన్న నిజయితీని ప్రేక్షకులు గుర్తించారని నిర్మాత  చింతా గోపాల కృష్ణారెడ్డి అన్నారు.