V6 News

ప్రాణ రక్షణ హెల్మెట్ తప్పనిసరి :  డీజీపీ శివధర్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ప్రాణ రక్షణ హెల్మెట్ తప్పనిసరి :  డీజీపీ శివధర్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

 జడ్చర్ల, వెలుగు : ​ రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మహబూబ్‌‌నగర్ జిల్లా జడ్చర్లలోని చంద్ర గార్డెన్స్‌‌ లో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాల్లో వారు మాట్లాడారు.

మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం లాంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జడ్చర్లకు త్వరలోనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరు చేయనున్నట్లు తెలిపారు.  రూరల్ పోలీస్ స్టేషన్ ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. మున్సిపల్ చైర్‌‌ పర్సన్ పుష్పలత, కలెక్టర్ ఖుష్బుగుప్తా, ఎస్పీ జానకి పాల్గొన్నారు.