V6 News

ఊరి జ్ఞాపకాలతో తిమ్మరాజుపల్లి టీవీ

ఊరి  జ్ఞాపకాలతో  తిమ్మరాజుపల్లి టీవీ

హీరో కిరణ్‌‌ అబ్బవరం నిర్మాతగా అందరూ కొత్త వాళ్లతో నిర్మించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సాయి తేజ్, వేద జలంధర్ జంటగా నటించగా,  వి.మునిరాజును దర్శకత్వం వహించాడు.  శుక్రవారం (ఏప్రిల్ 17) సినిమా విడుదలవుతున్న  సందర్భంగా గురువారం ప్రీ రిలీజ్ ప్రెస్‌‌మీట్ నిర్వహించారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘చిన్న పాయింట్‌‌తో మంచి సినిమా చేశామనే నమ్మకం ఉంది. 

అందుకే  బిజినెస్ డీల్స్ కోసం కూడా హడావుడి పడలేదు. రీసెంట్‌‌గా ఓటీటీ వాళ్లు చూసి సినిమా నచ్చి తీసుకున్నారు.  కొత్త వాళ్లందరిలో నన్ను నేను చూసుకున్నాను. ఇంకా మరికొంతమంది కొత్త వాళ్లకు అవకాశాలు కల్పిస్తూ ప్రొడ్యూసర్‌‌‌‌గా జర్నీ ఇలాగే కొనసాగిస్తాను’ అని చెప్పారు.  ప్రతి ఊరి వాళ్లు తమ జ్ఞాపకాలు రీ కాల్ చేసుకునే సినిమా ఇదని నటీనటులు, దర్శకుడు మునిరాజు అన్నారు.