V6 News

కేరాఫ్ కంచరపాలెంకు పది రెట్లు మెప్పించేలా.. రావు బహదూర్

కేరాఫ్  కంచరపాలెంకు పది రెట్లు మెప్పించేలా.. రావు బహదూర్

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేశ్ మహా  రూపొందిస్తున్న  చిత్రం ‘రావు బహదూర్’. జిఎంబీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ సమర్పణలో  చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్ రెడ్డి,  శరత్ చంద్ర కలిసి నిర్మిస్తున్నారు. బుధవారం  ఫస్ట్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌లో సత్యదేవ్ మాట్లాడుతూ ‘ఈ పాట మహిళలను సెలబ్రేట్ చేసేలా ఉంటుంది.  ఇందులో నేను పోషించిన  రామప్ప పాత్ర కోసం ప్రతిరోజూ ఐదు గంటల మేకప్ పట్టేది. మహేష్ గారి బ్యానర్‌‌‌‌లో నటించడం అదృష్టంగా భావిస్తున్నా’ అని అన్నాడు.  ఈ మూవీ తనకు గోల్డెన్స్ చాన్స్ అని హీరోయిన్ దీపా థామస్ చెప్పింది.  

 ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాకు  పది రెట్లు అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నానని దర్శకుడు వెంకటేష్​ మహా అన్నాడు.  గొప్ప థియేట్రికల్ ఎక్స్‌‌పీరియెన్స్ ఇచ్చే చిత్రమిదని నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర,  గోపాలకృష్ణారెడ్డి అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి , సింగర్ విజయ్ యేసుదాస్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.