V6 News

ఎట్టా ఎట్టా.. నిన్ను ఎట్టా చెక్కాడే దేవుడు.. ఆకట్టుకుంటున్న లెనిన్ సాంగ్

ఎట్టా ఎట్టా.. నిన్ను ఎట్టా  చెక్కాడే దేవుడు.. ఆకట్టుకుంటున్న లెనిన్ సాంగ్

అఖిల్ హీరోగా ముర‌‌ళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున‌‌, సూర్యదేవ‌‌ర నాగ వంశీ నిర్మిస్తున్న చిత్రం ‘లెనిన్’. గురువారం ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు. ‘‘ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగ.. ఓ యమ్మీ ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టా ఎట్టాగా..” అనే పల్లవితో మొదలైన ఈ  మాస్‌‌ మెలోడీ సాంగ్‌‌ను తమన్ కంపోజ్ చేయడంతో పాటు శ్రీకృష్ణతో కలిసి పాడాడు.  

‘‘రెండు కళ్లు సరిపోతలే.. రెప్ప మూయాలి అనిపిస్తలే.. నువ్వు తప్ప కనిపిస్తలే.. నీలా ఎవ్వరు అనిపిస్తలే.. నడుమేమో జానెడు జానెడు.. ఆ జడ చూస్తే బారెడు బారెడు.. తల్లో మడిచి ఎట్టుకున్న మల్లెపూలు మూరెడు.. నిన్ను ఎట్టా చెక్కాడే దేవుడు..” అంటూ భాస్కరభట్ల రాసిన సాహిత్యం ఆకట్టుకుంది.  

బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో  అఖిల్‌‌ వేసిన మాస్‌‌ స్టెప్స్‌‌, భాగ్యశ్రీ బొర్సే గ్లామర్‌‌‌‌తో పాటు ఈ ఇద్దరి ఆన్‌‌ స్క్రీన్‌‌ కెమిస్ట్రీ హైలైట్‌‌గా నిలిచింది.  జూన్‌‌ 26న సినిమా విడుదల కాబోతోంది.