అంబటి అర్జున్, శ్రీపూజ, స్నేహల్ కామత్ కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘పోచమ్మ’. రమేష్ ఇంద్ర దర్శకత్వంలో శ్రుతి నాయుడు నిర్మిస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సిరీస్ శుక్రవారం నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అంబటి అర్జున్ మాట్లాడుతూ ‘కొన్ని కంటెంట్‌లు ముందు సైలెంట్‌గా ఉంటాయి, కానీ రిలీజ్ అయ్యాక మంచి సౌండింగ్ చేస్తాయి. ఈ సిరీస్ కూడా అలాంటిదే. పోస్టర్, టైటిల్‌తోనే మా సిరీస్ అందరి దృష్టినీ ఆకర్షించింది. సిరీస్ కూడా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అని అన్నాడు.
జెస్సీ క్యారెక్టర్‌తో అలరిస్తానని స్నేహల్ కామత్ చెప్పింది. ఈ సిరీస్ తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని శ్రీ పూజ చెప్పింది. పోచమ్మ తల్లే తమను నడిపించిందని ఆహా కంటెంట్ హెడ్ కవిత అన్నారు.

